2 నెలల చిన్నారి మృతిపై డీజీపీకి బీఆర్ఎస్ వినతి పత్రం

  • కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట... చిన్నారి మృతి
  • డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్
  • బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి
కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట కారణంగా రెండు నెలల చిన్నారి మృతి చెందిన ఘటనకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ శివధర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజాలు వెలికి తీయాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కూతురును పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో చిన్నారి కిందపడి మృతి చెందింది. నిర్వాహుకుల కారణంగానే తమ కూతురు కిందపడిందని గణేశ్ దంపతులు ఆరోపిస్తున్నారు.

Srinivas Goud
Kummera Mallanna Jatara

More Telugu News